Telangana: వేడెక్కుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు.. ఇవాళ, రేపు కూడా అలానే..!

Hyderabad: భానుడు భగభగలకు రాష్ట్రం ఉడుకుపోతుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది .  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 08:15 AM IST
Telangana: వేడెక్కుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు.. ఇవాళ, రేపు కూడా అలానే..!

Telangana weather today: అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ అల్లాడుతుంది. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత కారణంగా వృద్ధులు, పిల్లలు మరియు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వడదెబ్బకు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 45.7 డిగ్రీలు, పాల్వంచలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

భానుడు నిప్పులు చెరుగుతుండటంతో.. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 47 మండలాల్లోని ప్రజలు వడగాలులతో అల్లాడిపోయారు. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచాయి. ఇక్కడ  ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని 10 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నిన్న వడదెబ్బతో మెదక్‌ జిల్లా కొల్చారంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 

Also Read: India Monsoon Reaches Kerala: నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. వాతావరణ సూచనలు ఇలా..!

శని, ఆదివారాల్లోనూ అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు హెచ్చరికలు సూచనలు జారీ చేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 

Also Read: Minister Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌరవులు.. హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News