అశ్వత్థామ రెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు

అశ్వత్థామ రెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు

Updated: Oct 25, 2019, 06:15 PM IST
అశ్వత్థామ రెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల మరణాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డే కారణమని పేర్కొంటూ కూకట్‌పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తప్పుడు డిమాండ్‌తో అశ్వత్థామ రెడ్డి ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోరేటి రాజు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

అంతకన్నా ముందుగా తాను తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూకట్‌పల్లి డిపో మేనేజర్‌కు దరఖాస్తు చేస్తున్నట్లు డ్రైవర్ కోరేటి రాజు మీడియాకు తెలిపారు. గురువారం తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే, ముందస్తు జాగ్రత్త చర్యగా వారి వివరాలను ఆర్టీసీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు వార్తలొస్తున్నాయి.