TSRTC PRC: టిఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బందికి పిఆర్సి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.
TSRTC fares hike issue: హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కొవిడ్-19 నేపథ్యంలో తమకు రావాల్సిన వేతనాలు బకాయి పడటంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని ఇక తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో బస్సులు నడిపి ప్రజా రవాణా సౌకర్యానికి సహకరించిన తమకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈడీల కమిటీ రూపొందించిన నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం ప్రగతి భవన్లో ఓ సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక్క డిమాండ్ మినహాయించి కార్మికుల మిగతా డిమాండ్లను పరిష్కరిస్తే, ఆర్టీసీ సంస్థపై పడే ఆర్థిక భారం, సాధ్యాసాధ్యాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టిఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించుకుని ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది, కార్మికులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకుని ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించిన వారు ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.