Govt Jobs: గురుకులాల్లో నాన్ టీచింగ్ పోస్టులు

TTWREIS Jobs 2020 | నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త. గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జులై 30.

Last Updated : Jul 27, 2020, 11:40 AM IST
Govt Jobs: గురుకులాల్లో నాన్ టీచింగ్ పోస్టులు

కరోనా సమయంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (TTWREIS) నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదకన ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, తదితర పోస్టులున్నాయి. 

గిరిజన గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులకు ఈ ఉద్యోగాల (TTWREIS Jobs 2020)లో ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత పోస్టులకు పదో తరగతి, సంబంధిత సబ్జెక్ట్‌లలో డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేది జులై 30. కనుక అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. Official Website

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

మొత్తం పోస్టులు: 58
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులివే..  

  • స్టాఫ్ నర్స్ 
  • కేర్ టేకర్ (డిగ్రీ కళాశాల)
  • ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కళాశాల)
  • కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కళాశాల)
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ
  • ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్
  • కిచెన్ హెల్పర్ / MPW's
  • ఆఫీస్ సబార్డినేట్స్ (అటెండర్)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి . ఫీజు: రూ.50

దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి or  Application form
ఎంపిక విధానం: అభ్యర్థుల మార్కులకు వెయిటేజీ
దరఖాస్తులకు చివరి తేది: 30.07.2020
Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు

Trending News