Vijaya milk prices | విజయ పాల ప్యాకెట్ల ధరల పెంపు

విజయ పాల ధరలను పెంచినట్టు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ (తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ TSDDCFL) ప్రకటించింది. లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలు పెంచినట్టు టిఎస్‌డిడిసిఎఫ్ఎల్ తమ ప్రకటనలో పేర్కొంది.

Last Updated : Dec 16, 2019, 01:03 AM IST
Vijaya milk prices | విజయ పాల ప్యాకెట్ల ధరల పెంపు

హైదరాబాద్: విజయ పాల ధరలను పెంచినట్టు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ (తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ TSDDCFL) ప్రకటించింది. లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలు పెంచినట్టు టిఎస్‌డిడిసిఎఫ్ఎల్ తమ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని టిఎస్‌డిడిసిఎఫ్ఎల్ స్పష్టంచేసింది. దీంతో ప్రస్తుతం రూ.42గా ఉన్న ఒక లీటర్ టోన్డ్ మిల్క్ సోమవారం నుంచి పెరిగిన రూ.2 ధరతో కలిపి రూ.44లకు లభించనుంది. స్టాండర్డ్ పాలు, హోల్ మిల్క్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని సంస్థ తెలిపింది. 

పాడి రైతుల వద్ద నుంచి పాలసేకరణకు వ్యయం పెరిగిన నేపథ్యంలోనే పాల సరఫరా ధరలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు టిఎస్‌డిడిసిఎఫ్ఎల్ వివరించింది. ఇకపై వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు, బేస్ మార్జిన్‌ను రూ. 3.25 పైసలు పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

Trending News