జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన సర్కార్!

జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన సర్కార్

Last Updated : Feb 9, 2019, 04:53 PM IST
జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన సర్కార్!

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికపై కోర్టులో పిటిషన్‌ దాఖలై ఉండగానే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జిల్లా కలెక్టర్ ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలు తెరిచారని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ టీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. దర్యాప్తు నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. 

ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నియామవళి ఉల్లంఘన కింద వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా స్పష్టంచేయడంతోపాటు తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ ఆదేశాల మేరకు కలెక్టర్ ఒమర్ జలీల్‌ను సస్పెండ్ చేస్తూ టీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం.

Trending News