Dhanurmasa Poojalu In Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఆరో రోజుకు చేరుకున్నాయి. తిరుప్పావై ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Devotees Heavy Rush In Yadadri Temple: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పుర వీధులు కిటకిటలాడాయి. హైదరాబాద్ పట్టణంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చారు.
Heavy Rush Of Devotees At Yadadri Temple: యాదాద్రి కొండపైన కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ ..యాదగిరిగుట్ట యాదాద్రి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి మూడు, నాలుగు గంటలు సమయం పట్టింది.
Yadadri Temple: కార్తీక మాసం నేపథ్యంలో దేశంలో ఎక్కడచూసిన శివ, వైష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు భక్తులు పొటెత్తారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనాలకు భక్తులు తరలిరావడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కార్తీక పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో మరింతగా రద్దీ పెరగనుంది. ఈ క్రమంలో అధికారులు సైతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. యాదాద్రికి ప్రత్యేకంగా బస్సుల్నిఏర్పాటు చేశారు.
Heavy Rains Lashed At Yadadri Lakshmi Narasimha Swamy Temple: యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.. కొండపై భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే కొండపై వర్షం పడితే తలదాచుకునే కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి.
All Hindu Temples In Telugu States A Head Lunar Eclipse: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి, తిరుమల ఆలయాలతో సహా అన్నీ ఆలయాలకు తాళం వేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Yadadri Brahmothsavalu: తెలంగాణలో అతిపెద్ద వైష్ణవ క్షేత్రమై యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 11వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Yadadri Temple: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. అవును యాదగిరి గుట్టలో మరో అద్బుత ఆవిష్కరణకు అక్కడి వేద పండితులు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..
Develop Yadadri Temple Like Tirumala Says Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ బోర్డు అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
Revanth Reddy Orders To Form A Board Like TTD In Yadadri:తన జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలో యాదాద్రికి కూడా పాలకమండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Padi Kaushik Reddy Reels Goes Viral In Yadadri Temple: తెలంగాణ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి ఆలయంలో చేసిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Telangana Govt Focused On Temples: తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రామప్పతోపాటు కీసర ఆలయంపై కూడా దృష్టి సారించారు.
Harish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. రేవంత్ ప్రమాణం చేసిన ప్రతి ఆలయాన్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని హరీశ్ రావు పూజలు చేయించారు.
Yadadri temple: పవిత్రమైన యాదాద్రి ఆలయందేవస్థానం పరిధిలో మాంసాహరం విందుభోజనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన వైటీడీఏ దివ్య విడిది(ప్రెసిడెన్సియల్ విల్లా)లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.