Hyderabad Rains: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దాయింది. ముఖ్యంగా మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. మూసీ నది ఉప్పొంగడంతో అలీ కేఫ్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దిల్ సుఖ్ నగర్ నుంచి అంబర్ పేటకు రాకపోకలు నిలిచిపోయాయి.