Ishikareddy: యువ నృత్యకారిణి ఇషికారెడ్డి తన కూచిపూడి డ్యాన్స్ తో కళాభిమానులను కట్టిపడేసింది. ఆరంగ్రేటంలోనే అబ్బురపరిచే ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకుంది.
Ishikareddy Kuchipudi dance: ఆరంగ్రేటంలోనే అదరహో అనిపించింది యువ నృత్యకారిణి ఇషికారెడ్డి. ఆమె డ్యాన్స్ కు సభికులు మంత్రముగ్ధులయ్యారు. శిల్పాకళావేదికలో యువ నృత్యకారిణి ఇషికారెడ్డికూచిపూడి నృత్య రంగ ప్రవేశం అహూతులను ఆకట్టుకుంది. గణేష్ కౌత్వం, పద్మావతీ ప్రవేశ దరువు, తక్కువేమన నృత్యం చేసి కళాభిమానులను ఫిదా చేసింది.