Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. బలహీన వర్గాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చే పరిస్థితి లేనప్పుడు తాను టీఆర్ఎస్ లో కొనసాగడం అర్ధరహితమని లేఖలో పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్. 2019లో ఓటమి తర్వాత పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో తన అవసరం లేదని మీరు భావించారంటూ కేసీఆర్ ను ఉద్దేశించి లేఖలో ప్రస్తావించారు బూర.