PM MODI: దేశంలో చీతాల సంబరం నెలకొంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి చీతాలు దేశంలో అడుగుపెట్టాయి. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక కార్గో విమానంలో పదిగంటలు ప్రయాణించి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. అక్కడనుంచి వాటిని కునో నేషనల్ పార్కుకు చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెట్టారు.