CM KCR: ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు ప్రధాని మోదీయే శత్రువు అని ఆయన మండిపడ్డారు.
CM KCR- PM Modi: తెలంగాణకు శత్రువు ప్రధాని మోదీయే అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించే ప్రభుత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా ప్రధాని మోదీ కావాలనే కాలయాపన చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.