2,000 free iPhones : కరోనావైరస్ ఎఫెక్ట్.. 2,000 ఐఫోన్లు ఉచితం

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో.. వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం ప్రపంచదేశాలన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Last Updated : Feb 17, 2020, 09:08 PM IST
2,000 free iPhones : కరోనావైరస్ ఎఫెక్ట్.. 2,000 ఐఫోన్లు ఉచితం

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. కరోనా పుట్టింది చైనాలోనైనా.. ప్రస్తుతం మరో 26 దేశాల్లో కరోనా కేసులు వెలుగుచుడటం ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.  కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో.. వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం ప్రపంచదేశాలన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కరోనా వ్యాధి సోకినవారిని ఇతరుల నుంచి వేరు చేస్తూనే... వారి నుంచి ఆ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జపాన్‌ను ఆనుకుని ఉన్న సముద్ర జలాల్లో ప్రయాణిస్తోన్న డైమండ్ ప్రిన్సెస్ ( Diamond Princess ) అనే భారీ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో పలువురు ఈ కరోనా వ్యాధి బారిన పడినట్టు జపాన్ ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1న డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ప్రయాణిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడికి ఈ వ్యాధి ఉన్నట్టు తేలడంతో జపాన్ ఉలిక్కిపడింది. అంతేకాకుండా ఆ నౌకను యొకొహోమ తీరం ఒడ్డునే నిలపడంతో పాటు అప్పటి నుంచే నౌకను క్వారంటైన్ జోన్‌గా ప్రకటిస్తూ జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫిబ్రవరి 19 వరకు నౌక క్వారంటైన్ జోన్‌గా కొనసాగుతుందని జపాన్ స్పష్టంచేసింది. 

అయితే, నౌకను సముద్ర తీరంలోనే ఆపడంపై నౌకలో ఉన్న వారు ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో నౌకలోని ప్రయాణికుల ఆందోళనపై స్పందించిన జపాన్ సర్కార్... వారి సహాయార్థం 2000 ఐఫోన్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఆ ఫోన్లలో ''లైన్'' అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఇచ్చింది. లైన్ యాప్‌తో ( Line app) జపాన్‌లోని వైద్య నిపుణులను సంప్రదించడం, వారి అపాయిట్‌మెంట్ తీసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం లైన్ యాప్ ఉపయోగపడుతుందని జపాన్ సర్కార్ స్పష్టంచేసింది.

జపాన్ మాత్రమే కాకుండా బయటి దేశాలకు చెందిన వారు కూడా నౌకలో ప్రయాణిస్తున్నారని.. వారి ఫోన్లలో లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేనందునే ఆ యాప్‌ని ప్రీ ఇన్‌స్టాల్ చేసి పంపిణీ చేసినట్టుగా జపాన్ ప్రభుత్వం వివరించింది. నౌకలో ఉన్న 3700 మంది ప్రయాణికులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందిస్తున్నట్టు జపాన్ చెబుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News