LPG Leak in China Restaurant 31 People Died: చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో ఎల్పీజీ గ్యాస్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చైనాలో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిని మూడు రోజులపాటు జరుపుకుంటున్నారు. సెలవదినం కావడంతో కొంత మంది బంధుమిత్రులతో ఒక చోట చేరి యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ లీకై పేలుడు సంభవించింది.
ప్రమాదం గురించి తెలియగానే 20కి పైగా ఫైరింజన్‌లు, 100కిపైగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆ దేశ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు. చైనాలో నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడి ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.
Also Read: Uganda school Attack: ఉగాండా స్కూల్‌పై ఉగ్రమూకల దాడి 41 మంది మృతి
గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
మరోవైపు మంగళవారం రాజస్థాన్ లో గ్యాస్ లీకై ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వంట చేస్తుండగా ఈ మంటలు వ్యాపించిట్లు తెలుస్తోంది. ఈ ఘటన భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Also Read: PM Modi US Tour: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని భేటీ.. జిల్ బైడెన్‌కు 'డైమండ్' ఇచ్చిన మోదీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి