Botswana Elephants Deaths : ఆఫ్రికాలో 350 ఏనుగుల మరణం.. అంతుచిక్కని కారణం

ఆఫ్రికా దేశం ( African Country ) అయిన బోత్సువానా ( Botswana ) లో అనుమానాస్పద రీతిలో 350 ఏనుగులు మరణించాయి.  వాటి మరణం వెనక అసలు కారణం ఏంటో కనుక్కోవడానికి వన్యప్రాణి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

Last Updated : Jul 2, 2020, 05:07 PM IST
Botswana Elephants Deaths : ఆఫ్రికాలో 350 ఏనుగుల మరణం.. అంతుచిక్కని కారణం

ఆఫ్రికా దేశం ( African Country ) అయిన బోత్సువానా ( Botswana ) లో అనుమానాస్పదంగా 350 ఏనుగులు మరణించాయి.  వాటి మరణం వెనక అసలు కారణం ఏంటో కనుక్కోవడానికి వన్యప్రాణి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. బోత్సువానాలో గత రెండు నెలలుగా సుమారు 350 ఏనుగులు ( 350 Elephants Death In Botswana  ) మరణించాయి. ఈ విషయం తెలుసుకున్న వన్య ప్రాణి ప్రేమికులు దిగులు పడుతున్నారు. వాటి మరణం వెనక అసలు కారణం ఏంటో కనుక్కోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. Also Read : జెనీలియా దంపతుల సంచలన నిర్ణయం..

ఇప్పటికే రంగంలోకి దిగిన బోత్సువానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ నేషనల్ పార్క్ ( Botswana Wild Life Officials ) అధికారులు వాటికి పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా కల్లోలం ( Coronavirus ) మధ్య ఆ శాంపిల్స్ను ప్రపంచంలోని పలు దేశాల్లోని అత్యుత్తమ ల్యాబ్స్కు పంపించడానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ( Lockdown ) మినహాయింపు ఉండటంతో ఆ దేశాలకు శాంపిల్స్ పంపించారు. అయితే శాంపిల్స్ను పరిశీలించి నివేదిక ( Test Results ) రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుంది అని తెలిసింది. అప్పటి వరకు గజరాజులు మరణానికి గల అసలు కారణం ఏంటో అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోనుంది. Also Read :  Rohit Sharma : రోహిత్ శర్మ సెంచురీతో తోకముడిచిన బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ 2019 సెమీస్ హైలైట్స్

ఆఫ్రికాలోను మొత్తం ఏనుగులు ( Total Elephants In Africa )  అన్నింటిలో మూడువ వంతు బోత్సువానాలోనే ఉన్నాయి. దాంతో వాటి మరణ వార్త ఆఫ్రికాను కుదిపేస్తోంది. ఏనుగులను వాటి దంతాల కోసం వేటగాళ్లు చంపిఉండే అవకాశం కూడా లేదు అని.. ఎందుకంటి వాటి దంతాలు మిస్ అవలేవు అని అధికారులు తెలిపారు. అయితే విషప్రయోగం జరిగిందా అనే కోణంలో నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల పర్యవరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి మరణంతో ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జంతు  ప్రేమికులు కలవరపడుతున్నారు. 

 

Trending News