Coronavirus : కరోనా సంక్షోభం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో క్రికెట్ ( International Cricket ) కు కూడా మినహాయింపు లభించలేదు. కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఏంటంటే మరో వారం రోజుల్లో (జులై 8 -12 ) ఇంగ్గాండ్ - వెస్ట్ ఇండీస్ ( England vs West indies test 2020 ) మధ్య టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. అయితే అప్పటి వరకు క్రికెట్‌ను మిస్ అయ్యే వారు పాత మ్యాచులు చూసుకుని ఆనందించవచ్చు. Read Also : అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..
సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2 జులై 2019న ప్రపంచ కప్ ( Cricket World Cup 2019 ) సెమీస్ లో చోటు సంపాదించడానికి టీమ్ ఇండియా ( Team India ) వీరోచిత పోరాటం చేసింది. ఇందులో రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతమైన సెంచరీతో భారత్ కు భారీ స్కోర్ ను సాధించి పెట్టాడు. తొలి వికెట్‌కు రోహిత్ వర్మ- కెఎల్ రాహల్ ( KL Rahul ) కలిసి మొత్తం 180 పరుగుల చేయగా.. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది.
Another #CWC19 match, another Rohit Sharma hundred 🙌#OnThisDay last year, Mustafizur Rahman claimed a five-for in a losing cause as India sealed a 28-run win over Bangladesh.
Log in to the ICC vault for exclusive extended highlights of the game 🎥 https://t.co/nSKrA5omVh pic.twitter.com/dhHGvCmBmg
— ICC (@ICC) July 2, 2020
అయితే భారీ లక్ష్మంతోె బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమిఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
Rohit Sharma : రోహిత్ సెంచురీతో తోకముడిచిన బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ 2019 సెమీస్