Burundi prison fire: తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండి(Burundi)లో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని గితెగా(Gitega)లోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో కనీసం 38 మంది ఖైదీలు మరణించారు. మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రోస్పర్ బజోంబాంజా(Prosper Bazombanza) వెల్లడించారు. ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమేంటో చెప్పలేదు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై అధికారులెవరు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, బురుండిలోని రెడ్‌క్రాస్ బృందాలు బాధితులను ఆదుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Also Read: Motorcycle explosion in Iraq: ఇరాక్ లో విషాదం.. బైక్ పేలిన ఘటనలో నలుగురు సజీవదహనం..
బురుండి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రకారం, 400 మంది ఖైదీల సామర్థ్యం కలిగిన గితెగా జైలులో గత నెల నాటికి 1,539 మంది ఖైదీలను ఉంచారని ఆరోపించారు. మరోవైపు, బురుండి అంతర్గత మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసిన ట్వీట్‌లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణమని వెల్లడించింది.
Incendie dû à un court-circuit maîtrisé par @Burundi_Police à la prison centrale de @Gitega : 38 prisonniers morts et 69 autres blessés. Le Vice-président de la République + les ministres du @MininterInfosBi, @MiniJustice_BDI, @minisante et @GenreMinistere au chevet des victimes pic.twitter.com/h1wJtzijjQ
— MininterInfosBi (@MininterInfosBi) December 7, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook