Motorcycle explosion in Iraq: ఇరాక్‌లో బైక్ పేలిన(Motorcycle explosion) ఘటనలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు ఇరాక్ భద్రతా దళాలు తెలిపాయి. ఇరాక్(Iraq)లోని దక్షిణాది నగరమైన బస్రా(Basra)లో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
తొలుత ఈ పేలుడును కారు బాంబుగా భావించారు. అయితే బస్రా గవర్నర్ అసద్ అల్ ఇదానీ(Asaad al-Idani) మోటారుసైకిల్ పేలిందని విలేకరుల సమావేశంలో తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని రెండు కార్లు దగ్ధమైనట్లు పేర్కొన్నారు. మోటార్ సైకిల్‌కు బాంబు అమర్చారా? లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: UAE Weekend: అక్కడ నాలుగున్నర రోజులే పనిదినాలు.. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ మొదలు!!
పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. 2017లో సున్నీ మిలిటెంట్ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (Islamic State group)ఓడిపోయినప్పటి నుంచి బస్రాలో పేలుళ్లు జరగడం చాలా అరుదు. చమురు సమృద్ధిగా ఉండే బస్రాలో షియాలు ఎక్కువగా ఉన్నారు. పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook