Tulsa Shooting: ఆసుపత్రిలో కాల్పుల మోత.. నిందితుడితో సహా ఐదుగురు మృతి!

Gun shoot at America: అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలోని ఓ ఆస్పత్రి క్యాంపస్ లో జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 08:43 AM IST
Tulsa Shooting: ఆసుపత్రిలో కాల్పుల మోత.. నిందితుడితో సహా ఐదుగురు మృతి!

Gun shoot at America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆస్పత్రి (Saint Francis Hospital in Tulsa) క్యాంపస్‌ భవనంలో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా..మరికొంత మంది గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దుండగుడు ఎలా మరణించాడనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. కాల్పులు జరిగే సమయంలో భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది...రోగులను సేఫ్ ప్లేస్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం ప్రకటించారు. 

ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు ఎక్కువైపోయాయి. మంగళవారం న్యూ ఒర్లీన్స్‌లోని ఓ పాఠశాల స్నాతకోత్సవంలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఓ వృద్ధురాలు మృతి చెందింది.  గతంలో ఈశాన్య లూసియానా వర్సిటీ జరిగిన పాఠశాల స్నాతకోత్సవంలో కాల్పులు జరిగి నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మరోమారు తుపాకీ పేలటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గన్ వయలెన్స్ ఆర్కైవ్ సేకరించిన డేటా ప్రకారం, దీంతో కలిపి ఈ ఏడాది 233 సామూహిక షూటింగ్స్ చోటుచేసుకున్నాయి.

Also Read: US SHOOTING: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. మహిళ మృతి, ఏడుగురికి గాయాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News