Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణలో రష్యన్ సైనికుల ఆకృత్యాలు యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ మహిళలపై అత్యాచార ఘటనలే వెలుగుచూడగా.. తాజాగా ఉక్రెయిన్ పురుషులు, బాలురపై కూడా రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. పుతిన్ దూకుడు చూస్తుంటే ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకునేదాకా ఆయన శాంతించేలా లేరు.
Russia Ukraine War Updates: రష్యాలోని బ్రయాన్స్క్ నగరంలో ఉన్న ఓ ఆయిల్ డిపోలో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడి వల్లే ఈ ఘటన జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఏవిధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Russia Ukraine War Updates: ఇరు దేశాల మధ్య ఇప్పటికీ నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవేవీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది సాధారణ పౌరులతో పాటు ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పోలాండ్‌కు సరిహద్దులోని పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన ఎల్వివ్లోని సైనిక స్థావరంపై రష్యా దాడులకు పాల్పడింది.
Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రోజు రోజుకు ఆందోళనకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించింది.
Indians Evacuation from Ukraine: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అక్కడి నుంచి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Russia Drops 500kg Bombs on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అంతకంతకూ దాడులను ఉధృతం చేస్తూ మళ్లీ కోలుకోలేని రీతిలో ఉక్రెయిన్‌ని దెబ్బ కొడుతోంది.
PM Modi Phone Call to Ukraine President: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై జెలెన్స్కీతో చర్చించారు.
Russia-Ukraine War : అమెరికా సెనేటర్స్‌తో వర్చువల్ సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. బహుశా మీరు నన్ను ప్రాణాలతో చూడటం ఇదే చివరిసారి కావొచ్చునని వ్యాఖ్యానించారు.
Russia Uraine War: ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. పౌరుల తరలింపు ప్రక్రియకు వీలుగా కాల్పులను విరమిస్తున్నట్లు తెలిపింది.
Indian Restaurant in Kyiv offering free shelter: ఉక్రెయిన్‌పై దాదాపు గత వారం రోజులుగా రష్యా దాడులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి ఇంకా తెరపడకపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ సంక్లిష్ట సమయంలో ఓ ఇండియన్ రెస్టారెంట్ వారికి అండగా నిలుస్తోంది.
Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తక్షణమే తమను యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవాలని జెలెన్స్కీ ఈయూకి విజ్ఞప్తి చేశారు.
Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీ బంకర్లో తలదాచుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిని ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు.
Ukrainian President Volodymyr Zelensky in military uniform: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జలన్‌స్కీ ఆర్మీ దుస్తులు ధరించి రష్యాపై యుద్ధం చేస్తున్నారని కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమెంత ? ఈ ఫొటోలు చూసిన నెజిజన్లు జెలన్స్కీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో అన్నీ తానై ముందున్నాడంటూ.. పొగుడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.