America-China Talks: అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక దౌత్యవిధానాలపై దృష్టి సారించిన జో బిడెన్ చైనాతో సైనిక చర్చలు జరిపారు. ఆఫ్ఘన్ పరిస్థితులపై సైతం ఇరుదేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఆఫ్ఘన్ పరిణామాల నేపధ్యంలో అమెరికా, చైనా దేశాల మధ్య జరిగిన సైనిక చర్చలు(America-China Military Talks) ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్(Joe Biden) అధికారం చేపట్టిన తరువాత ఈ రెండు దేశాల మధ్య జరిగిన తొలి సైనిక చర్చలివి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ మిలటరీ కో ఆపరేషన్ మేజర్ జనరల్ హాంగ్ జూపింగ్..అమెరికా మిలటరీ జనరల్ మైఖేల్ ఛేజ్ మధ్య వీడియా కాన్ఫరెన్స్ ద్వారా చర్చ జరిగింది. ఆఫ్ఘన్ (Afghanistan)దేశంలో జరుగుతున్న పరిణామాలపై సైతం రెండు దేశాల సైనిక ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది. గతంలో ఇదే అంశం అమెరికా, చైనా విదేశాంగమంత్రుల మధ్య ప్రస్తావనకొచ్చినా..అమెరికా నిర్లక్ష్యం చేసిందనేది చైనా ఆరోపణగా ఉంది. అమెరికా, చైనాలు కలసికట్టుగా ఆఫ్ఘన్ సమస్యపై దృష్టి సారిస్తే రెండు దేశాలకు పెద్ద ప్రమాదం తప్పుతుందని చైనా మిలిటరీ ఆలోచన. ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ తిరిగి బలాన్ని పుంజుకుంటే..చైనాతో సహా చాలా దేశాలకు ప్రమాదమని చైనా సూచిస్తోంది.
Also read: Deer Tested Corona positive: ప్రపంచంలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook