Jeo Bden Tour in Poland: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపబోమని రష్యా అధ్యక్షుడు.. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు.. యుద్ధం కొనసాగిస్తున్నారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ దేశస్థులు కొంత మంది దేశాన్ని విడిచి పొరుగు దేశాలకు వలస వెళ్తుండగా.. మరి కొంత మంది యుద్ధంలో పాల్గొంటున్నారు. రష్యాలో కూడా కొంత మంది జనం ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్నారు. ఇతర దేశాల నుండి రష్యా దేశానికి దిగుమతులు తగ్గటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు యూరప్ దేశాల పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రాంతాలను సమీక్షిస్తున్న జో బైడెన్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడి పుతిన్ ఎంతో మందిని బలితీసుకున్నారని అన్నారు. పుతిన్ దురాక్రమణకు దిగి భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వస్త్రాలను ప్రయోదిస్తామని బెదిరిస్తూ మరో పక్క ప్రపంచాన్ని ఆందోళనలో నెట్టేశారని అన్నారు. తన చర్యలతో పుతిన్ తనను తాను పరమ కసాయి వాడిగా నిరూపించుకున్నారని అభివర్ణించారు.
యూరప్ దేశాల పర్యటనలో ఉన్న అగ్ర రాజ్యం అధ్యక్షుడు జో బెడెన్ యుద్ధ క్షేత్ర సమీపంలోకి వెళ్లారు. రష్యా బాంబుల దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్‌లో బైడెన్ పర్యటించారు. పోలండ్ రాజధాని వార్సా వెళ్లిన బైడెన్.. అక్కడ పోల్యాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరగుతున్న యుద్ధంతో పాటు శరణార్థుల పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరొప్ దేశాల కూటమిగా ఉన్న నాటోను చీల్చేందుకు పుతిన్ గతం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు బైడెన్. అయితే తన ప్రయత్నాల్లో అన్నింటిల్లో విఫలం అవడంతో చివరకు ఇలా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డారని అన్నారు. ఉక్రెయిన్‌ను ఏకాకిగా చేసి నాటోను చీల్చేందుకు పుతిన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు.
Also Read: Imran Khan Resign: రాజీనామాకు సిద్ధమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?
Also Read: IPL 2022 Captains: ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌లు ఆరుగురు.. ప్రస్తుతం ఉన్నది మాత్రం 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook