మిల్వాకీ: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నిందితుడి కాల్పుల్లో అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. అనంతరం కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మొత్తం ఆరుగురు చనిపోయారు. మిల్వాకీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. మిల్వాకీ పోలీస్ చీఫ్ అల్ఫాంజో మోరెల్స్ కథనం ప్రకారం.. 51 ఏళ్ల సాయుధుడు మెల్సన్ కూర్స్ అనే బీర్ల తయారీ కంపెనీలోకి ప్రవేశించాడు.
See photos: భీష్మ సక్సెస్ మీట్లో రష్మిక మెరుపులు
తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, మరికొందరికి గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ అనంతరం నిందితుడు అదే తుపాకీతో కాల్పుచుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు ఆ బీర్ల కంపెనీ మాజీ ఉద్యోగి అని, కొంతకాలం కిందట అతడ్ని జాబ్ నుంచి తీసేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా
కంపెనీకి చెందిన ఉద్యోగి ఐడీ కార్డుతో లోపలికి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న పగతోనే ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కంపెనీలో 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అందరి వివరాలు సేకరిస్తున్నామని మిల్వాకీ పోలీస్ చీఫ్ తెలిపారు.
Also Read: చీరలంటూ ఛీకొట్టే పనులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
The Press Conference will now be held at 6:30 pm at 35th and State St. The Mayor, Chief Morales and other law enforcement officials will provide an update regarding this incident.
— Milwaukee Police (@MilwaukeePolice) February 26, 2020