World Breastfeeding Week 2022: నవజాత శిశువులకు తల్లి పాలు చాలా ముఖ్యం. వీటి వల్లే వారు సంపూర్ణ ఆహారం పొందుతారు. ముఖ్యంగా వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిణ కలిగిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం తల్లిపాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవం గురించి ఎవరికీ అవగాహణ లేదు. అయితే తల్లి పాల ప్రాధన్యత, వాటి విశిష్టతను తెలిపేందుకే ప్రతి సంవత్సరంలో ఆగష్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల అవగాహణ దినోత్సవాన్ని జరుపుదకుంటారు. ఈ వారంలో తల్లిపాల గురించి అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే తల్లి పాలలో ఉండే గుణాలు తల్లీ బిడ్డలు హెల్తీగా ఉంచుతాయని పలు నివవేదికలు తెలిపాయి.
తల్లి పాల గురించి డాక్టర్ అంకితా చందనా పలు రకాల చిట్కాలను అందిస్తున్నారు. స్త్రీ ప్రసవం తర్వాత వెంటనే పాలు రాకపోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో దగ్గరలో ఉన్న వైదులను సంప్రదించి పలు సుచనలు, సలహాలు పాటిస్తే పాలు రావడం మొదలవుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా స్త్రీ ప్రసవించిన తర్వాత వెంటనే పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలుంటాయని వైద్యురాలు తెలిపారు. కావున బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను ఆహారంగా ఇవ్వాలి.
ప్రస్తుతం చాలా మంది స్త్రీలకు ప్రసవం తర్వాత పాలు రావడం కష్టంగా మారింది. అయితే వీరికి కచ్చితంగా రెండు రోజుల తర్వాత పాలు వస్తయని ఆమె తెలుపుతున్నారు. పిల్లలకు సరైన మార్గంలో పాలను అందించడం వల్ల శరీర అభివృద్ధి, ఖండరాల అభివృద్ధి త్వరగ మొదలవుతుంది. ముఖ్యంగా బలహానంగా ఉన్న పిల్లలు యాక్టివ్‌గా మారడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా వారిలో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
పిల్లలకు పాలను ఇచ్చే క్రమంలో కచితంగా రొమ్ము శుభ్రం చేయాలి. లేక పోతే పిల్లల నోటి ద్వారా బ్యాక్టిరీయ ప్రవేశించి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశాలున్నాయని వైద్యురాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలకు రోజులో 8 నుంచి 10 సార్లు తల్లి పాలను పట్టించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే పిల్లలు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడితే ఔషధాలను రొమ్ము ద్వారా పాలను పట్టించే క్రమంలో పిల్లలకు ఇవ్వచ్చొని నిపుణులు తెలుపుతున్నారు.
బ్రెస్ట్ మిల్క్ ద్వారా పిల్లలకు చాలా రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ పాలు పిల్లలకు సులభంగా జీర్ణమవుతుంది. అయితే చాలా మంది పిల్లలకు తల్లులు ఇప్పుడు పాలను అందించడం లేదు. చాలా మంది స్త్రీలు ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేసేందుకు అసక్తి చూపడం లేదు. పిల్లలకు తల్లి పాలు చాలా ముఖ్యంగా కావున ప్రతి మహిళ ప్రసవం తర్వాత తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పాలు అందించాలి. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు.
Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook