Britain Covid rules: బ్రిటన్​ సంచలన నిర్ణయం- త్వరలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత!

బ్రిటన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపు దిశగా అడుగులు (Britain Govt on Covid rules) వేస్తోంది. వచ్చే వారం నుంచి ఆంక్షల సడలింపు ఇవ్వనున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ఆ దేశ దిగువ సభలో (Britain Boris Johnson on Corona rules) ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 02:32 PM IST
  • కఠిన ఆంక్షలపై బ్రిటన్ కీలక నిర్ణయం
  • వచ్చే వారం నుంచి పలు మినహాయింపులు
  • మాస్క్ తప్పనిసరి నిబంధన తొలగించే అవకాశం!
Britain Covid rules: బ్రిటన్​ సంచలన నిర్ణయం- త్వరలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత!

Britain Covid rules: బ్రిటన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపు దిశగా అడుగులు (Britain Govt on Covid rules) వేస్తోంది. వచ్చే వారం నుంచి ఆంక్షల సడలింపు ఇవ్వనున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ఆ దేశ దిగువ సభలో (Britain Boris Johnson on Corona rules) ప్రకటించారు.

సడలింపులు అందుకేనా?

గత నెలలోనే బ్రిటన్​లో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్​ కేసులు పీక్​ దశను తాకాయి. కొన్ని రోజులు అదే స్థాయిలో కేసులు  (Corona in Britain) నమోదయ్యాయి.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రోజుకు రెండు లక్షలకుపైగా కరోనా కేసులు (Corona cases in Britain) నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు కూడా రికార్డు స్థాయిలో వెలుగు చూశాయి. దీనితో డిసెంబర్ 8 నుంచి కఠిన ఆంక్షలు అమలు చేసింది ప్రభుత్వం. ఫలితంగా ఇటీవల మళ్లీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని ఆఫీస్​ ఆఫ్​ నేషనల్​ స్టాటిస్టిక్స్​ తెలిపింది.

యూకే వ్యాప్తంగా ఇటీవల ఒక్క రోజులో 108,069 కరోనా కేసులు వెలుగు (Corona cases in UK) చూశాయి. గత నెల పీక్​తో పోలిస్తే ఈ కేసులు దాదాపు 50 శాతంకన్నా తక్కువ.

సడలింపులు ఇలా..

మాస్క్​లు తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు ఆఫీసులకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రధాని బోరిస్​ జాన్సన్​ పేర్కొన్నారు. సభలు, సమావేశాలకు హాజరయ్యే వారు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ చూపించాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సవరించనుంది (Britain set to lift Covid rules ) ప్రభుత్వం.

అయితే బ్రిటన్​లో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచపవ్యాప్తంగా ఇప్పటి వరకు 339,662,209 కరోనా కేసులు (Worldwide Corona cases) నమోదయ్యాయి. అందులో 273,246,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 60,831,688 యాక్టివ్​ కరోనా (Worldwide Corona acitve cases) కేసులు ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,584,390 మంది ప్రాణాలు (Worldwide Corona deaths) కోల్పోయారు.

Also read: Lions Infected Covid 19: మనుషుల నుంచి సింహాలకు కరోనా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు

Also read: 5G Services In US: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News