5G Networks, Flight Crashes: 5G నెట్‌వర్క్‌తో విమానాలు కూలిపోతాయా ? విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి ?

5G Network scare, Airlines Cancelling Flights : 5జీ వల్ల అమెరికాకు వెళ్లే ప్రధాన విమానయాన సంస్థల ఫ్లైట్స్‌ మొత్తం రద్దు. ఎయిర్‌‌లైన్స్ మొత్తం మొత్తం భయపడడానికి కారణం ఏమిటి ? విమానాలకు సంబంధించిన ఆల్టీమీటర్ల వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే 5జీ స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ ఉంటే ఏమవుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 01:50 AM IST
  • అమెరికాలో తాజాగా 5జీ సేవలు ప్రారంభం
  • అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఎయిర్‌లైన్స్
  • యూఎస్‌కు వెళ్లాల్సిన ఫ్లైట్స్‌ అన్నింటినీ క్యాన్సిల్ చేసుకున్న విమానయాన సంస్థలు
5G Networks, Flight Crashes: 5G నెట్‌వర్క్‌తో విమానాలు కూలిపోతాయా ? విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి ?

5G Network scare, flights cancelled : అమెరికాలో తాజాగా 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు ఈ 5జీ నెట్‌వర్క్ సేవల్ని ప్రారంభించాయి. 5G కనెక్టివిటీ (5G connectivity) కోసం అమెరికాలో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన వారికి ఇది శుభవార్త కాగా.. ఎయిర్‌లైన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానయాన సంస్థలన్నీ యూఎస్‌కు (US) వెళ్లాల్సిన తమ ఫ్లైట్స్‌ అన్నింటినీ రీషెడ్యూల్‌ చేశాయి. 

ఇక 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ నెట్‌వర్క్‌ (5G network) సేవల నిర్వహణ కోసం గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డర్‌‌ దక్కించుకుంది. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలన్నీ అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను క్యాన్సిల్‌ చేసుకుంటున్నాయి. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కొన్ని రీషెడ్యూల్‌ అయ్యాయి. 

ఇక ఎయిరిండియా (Air India) కూడా అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామంటూ ట్వీట్ చేసింది. అలాగే బ్రిటిష్ ఎయిర్‌వేస్, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్, (Emirates) జపాన్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. 

అయితే యుఎస్‌కి వెళ్లే అన్ని విమానాలు రద్దు కాలేదు. లాస్ ఏంజెల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన ఇతర ప్రధాన విమానశ్రయాలకు వెళ్లే ఫ్లైట్స్‌ రద్దు అయ్యాయి. ఇక వర్జిన్ అట్లాంటిక్, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్‌ఎం వంటి అనేక ఇతర విమానశ్రయాలకు వెళ్లే ఫ్లైట్స్‌ రద్దు కాలేదు.

ఇక బోయింగ్‌ బీ777 (Boeing B777) వంటి విమానాలను ఎయిర్ ఇండియా పునఃప్రారంభించింది. ఇలా ఎయిర్ ఇండియా మొత్తం ఆరు ఇండియా-యుఎస్ విమానాలను తిరిగి ప్రారంభించింది. అయితే పలు విమానయాన సంస్థల ఆందోళనతో 5జీ సేవల ప్రారంభాన్ని యూఎస్‌లో రెండుసార్లు టెలికాం సంస్థలు వాయిదా వేశాయి. విమానాలు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నాయో లెక్కించేందుకు ఉపయోగపడే ఆల్టీమీటర్ల వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే..... అత్యంత వేగంగా డేటా బదిలీకి వీలు కల్పించే 5జీ (5G) సేవల స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ ఉంటోంది. దీంతో యూఎస్ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) (US Federal Aviation Administration) ఆల్టీమీటర్లకు (altimeters) వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి ఈ 5జీ నెట్‌వర్క్‌ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

5జీ నెట్‌వర్క్‌ వల్ల విమానంలోని రేడియో ఆల్టీమీటర్‌ ప్రభావితమై ఇంజినులోని బ్రేకింగ్‌ వ్యవస్థ ల్యాండింగ్‌ మోడ్‌ను దెబ్బతీస్తుందంటూ అమెరికాలోని విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. దీంతో విమానం రన్‌వేపై ఆగడం కష్టమవుతుందని పేర్కొంది.

అయితే తమ పరికరాలేవీ కూడా విమానాల ఎలక్ట్రానిక్స్‌కు ఆటంకం కలిగించబోవంటున్నాయి టెలికాం కంపెనీలు ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌లు. ఈ 5జీ సేవల్ని అనేక దేశాల్లో సురక్షితంగా వినియోగిస్తున్నారంటూ వివరించాయి. అయితే, ఆందోళనల నేపథ్యంలో ఎయిర్‌పోర్టులకు రెండు మైళ్ల పరిధిలో ఉన్న తమ 5జీ టవర్స్‌ను ఆన్‌ చేయమని టెలికాం కంపెనీలు తెలిపాయి. కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయం ఇంకా తెలియదు.

Also Read : Pushpa Dialogue video: కిలి పాల్ నోట పుష్ప ఫ్లవర్ డైలాగ్.. నీయవ్వ తగ్గేదెలే!

అయితే ఐరోపా సమాఖ్య పరిధిలో 2019లోనే 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3.4 - 3.8 గిగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5G నెట్‌వర్క్‌ సేవల నిర్వహణకు అనుమతినిచ్చాయి. ఇక యూఎస్‌లో ప్రస్తుతం అమల్లోకి వచ్చిన 5జీ ఫ్రీక్వెన్సీతో పోలిస్తే ఈ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన బ్యాండ్లను ఇప్పటికే అనేక ఐరోపా సమాఖ్య సభ్యదేశాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నాయి. దాదాపు 31 దేశాల విమానయాన సంస్థల్ని పర్యవేక్షిస్తున్న యురోపియన్‌ యూనియన్ ఏవియేషన్‌ సెఫ్టీ ఏజెన్సీ కూడా ఈ సమస్యపై స్పందించింది. ప్రస్తుతం అమెరికాలో (America) తలెత్తిన ఆందోళన కేవలం యూఎస్‌కు మాత్రమే పరిమితమంటూ పేర్కొంది.

Also Read : Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్​ సెన్​..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News