అవును.. చైనాలో కిమ్ పర్యటన నిజమే

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్ సోమవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చైనా దేశంలో పర్యటించడం నిజమేనని ఆదేశ వర్గాలు స్పష్టం చేశాయి.

Last Updated : Mar 28, 2018, 11:13 AM IST
అవును.. చైనాలో కిమ్ పర్యటన నిజమే

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్ సోమవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చైనా దేశంలో పర్యటించడం నిజమేనని ఆదేశ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇది స్నేహపూర్వక పర్యటనగా చైనా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీకి ముందుగా చిరకాల మిత్ర దేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సంప్రదింపుల కోసం కిమ్‌ బీజింగ్‌ నగరానికి వచ్చినట్లు సమాచారం. ఉత్తరకొరియా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తర్వాత కిమ్‌ జాగ్‌ చేసిన తొలి విదేశీ పర్యటన ఇది.

ఇరువురు భేటీలో ఏమి మాట్లాడుకున్నారో విషయాలు బయటకు రాలేదు. అయితే అణ్వాయుధాల వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడానికి ఉత్తరకొరియా కట్టుబడి ఉందని, అమెరికాతో సత్సంబంధాలను కోరుతున్నట్లు, దేశాల మధ్య శాంతినెలకొనేందుకు అవసరమైన చర్యలన్నింటికీ  సిద్ధంగా ఉన్నట్లు కిమ్ జిన్‌పింగ్‌తో చెప్పారట.

‘కిమ్‌ చైనా పర్యటన’కు సంబంధించి బుధవారం అధికారిక ఫొటోలు విడుదలయ్యాయి. బీజింగ్‌లోని ప్రఖ్యాత గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ భవనంలో కొరియా అధ్యక్షుడు కిమ్‌ గౌరవార్థం విందును ఏర్పాటుచేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమం తాలూకు ఫొటోలను చైనా, ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలే బహిర్గతం చేశాయి.

Trending News