ప్రముఖ మీడియా సంస్థకు బాంబు బెదిరింపు.. భవనం ఖాళీ చేసిన సిబ్బంది!

మీడియా సంస్థకు బాంబు బెదిరింపు

Last Updated : Dec 7, 2018, 01:49 PM IST
ప్రముఖ మీడియా సంస్థకు బాంబు బెదిరింపు.. భవనం ఖాళీ చేసిన సిబ్బంది!

న్యూయార్క్: న్యూయార్క్‌లోని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు టైమ్ వార్నర్ సెంటర్ బిల్డింగ్‌లో వున్న సిబ్బందిని ఖాళీ చేయించి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. భవనంలో ఐదు చోట్ల బాంబులు అమర్చినట్టు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడటంతో కొలంబస్ సర్కిల్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బాంబు స్వ్కాడ్ బృందాలు.. భవనంలో బాంబుల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్టు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ హ్యూబర్ట్ రేయిస్ మీడియాకు తెలిపారు. భవనంలో సోదాలు నేపథ్యంలో కొలంబస్ సర్కిల్‌ పరిధిలోకి ఎటువంటి వాహనాలు, పాదచారులను అనుమతించకుండా పూర్తిగా మూసేసినట్టు హ్యూబర్ట్ పేర్కొన్నారు. 

గురువారం రాత్రి 10 గంటలకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రత్యక్ష ప్రసారాలన్నింటిని నిలిపేసిన సీఎన్ఎన్ ఛానెల్.. ప్రోగ్రామ్ మోడ్ స్విచాన్ చేసి భవనం ఖాళీ చేసింది. గత అక్టోబర్ నెలలోనూ సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్ కార్యాలయానికి ఇదే తరహాలో ఓ బాంబు అమర్చిన పార్సిల్ వచ్చిన నేపథ్యంలో మొత్తం భవనాన్ని ఖాళీ చేసి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Trending News