TikTok: చైనాకు షాక్.. టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Bans TikTok Transactions) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు.

Last Updated : Aug 7, 2020, 12:08 PM IST
  • చైనా యాప్స్‌పై అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్
  • టిక్‌టాక్, విచాట్ లావాదేవీలపై అమెరికాలో నిషేధం
  • ఉత్తర్వులపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు
  • 45 రోజుల తర్వాత నిషేధం అమలులోకి...
TikTok: చైనాకు షాక్.. టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక నిర్ణయం

చైనా యాప్స్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు. ఈ మేరకు వేరువేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆగస్టు 6న అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 45 రోజుల తర్వాత నిషేధం అమలులోకి రానుంది. చైనా యాప్స్ వల్ల దేశ భద్రతకే ముప్పు పొంచి ఉంటుందని, అందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ ప్రకటించారు. Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ కచ్చితంగా అమెరికాలోని ఏదైనా కంపెనీకి తమ కంపెనీని విక్రయించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అమెరికాలో టిక్ టాక్ నిషేధిస్తారు. కొన్ని రోజుల కిందట దీనిపై ట్రంప్ ప్రకటన చేయగా.. తాజాగా ఉత్తర్వులపై సంతకాలు చేసి మరో అడుగు ముందుకేశారు. చైనా యాప్స్ వల్ల అమెరికా భద్రతకు, పౌరుల రక్షణకు ముప్పు పొంచి ఉంటుందన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నానని ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.  COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు

భారత్ ప్రస్తావన..
తాను మాత్రమే కాదని, ఇటీవల భారత్‌లోనూ చైనా యాప్‌లను నిషేధించించారని ట్రంప్ ప్రస్తావించారు. టిక్ టాక్ సహా మరెన్నో యాప్‌లపై భారత్ నిషేధం విధించడంతో పాటు.. తమ పౌరుల సమాచారాన్ని చోరీ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించిందని గుర్తుచేశారు. టిక్‌టాక్‌ను నిషేధించిన తొలి దేశం భారత్ అని, అక్కడ మొత్తం 106 వరకు చైనా యాప్‌లను నిషేధించారని, భద్రత, నిఘా అంశాలకు భంగం వాటిల్లకుండా అమెరికా సైతం ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి  
‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ హాట్ హాట్‌గా..

Trending News