డ్రైవర్ లేకుండానే సురక్షిత ప్రయాణం ; ఆటో షోలో సూపర్ కారు ప్రదర్శన

డ్రైవింగ్ చేస్తూ విసుగెత్తి పోయారా.. ఇక ఆ సమస్య ఉండబోదు. డ్రైవింగ్ చేయకుండానే సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. డ్రైవర్ లేకుండా ఎంచక్కా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేయవచ్చు.. నమ్మలేకపోతున్నారు కదూ ..ఇది నిజం..  వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

Last Updated : Oct 3, 2018, 11:35 AM IST
డ్రైవర్ లేకుండానే సురక్షిత ప్రయాణం ; ఆటో షోలో సూపర్ కారు ప్రదర్శన

లండన్: ప్యారిస్‌ ఆటో షో సరికొత్త ఆవిష్కరణకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆటో షోలో లో ప్రదర్శించిన రెనాల్ట్‌ మోడల్‌ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఏంటి ఇందులో ప్రత్యేకత అనుకుంటున్నారా.. ఈ కారుకు డ్రైవర్‌తో పనిలేదు... డ్రైవింగ్ చేయకూండానే సురక్షితంగా అనుకున్న గమన్యానికి చేరువచ్చట. చేయాల్సిందల్లా మొబైల్‌లో కారుకు సంబంధించిన  యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.. లోడ్‌ చేసిన ప్రత్యేక యాప్‌లో ఎక్కడికి వెళ్లాలి..ఎలా వెళ్లాలో రూట్‌మ్యాప్‌ ఫీడ్‌ చేస్తే చాలు. ఎంచక్కా గమ్యానికి చేరిపోతుంది. 

డైవర్ లెస్ కారు ప్రత్యేకతలు ఇవే...
* బ్యాటరీతో నడిచే కారు కావడంతో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు
*  పందొమ్మిది అడుగుల పొడవుండే కారులో ఇంటీరియర్‌ అద్భుతం
* అటూ ఇటూ కదులుతూ సౌకర్యవంతంగా ఉండే సీట్లు
* భద్రత కోసం కారులో కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు ఫిక్స్

మనసుపారేసుకున్న కష్టమర్లు

ఆటో షోలో ప్రదర్శించిన ఈ సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారును చూసినోళ్లంతా మనసుపారేసుకున్నారు..కొనేద్దామని ముందకు వస్తే .. దీని ధర ఎంత పలుతోంది.. ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నదీ మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదట. త్వరలో మార్కెట్లోలోకి రానున్న ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు...ఎంతో  సౌకర్యవంతమైన, విలాసవంతంగా ఉంటుందని... వ్యక్తిగత హొదా కోసం కారు కావాలని కోరుకునే వారితోపాటు కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు రెనాల్ట్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Trending News