Henley Passport Index: దిగజారిన భారతదేశ పాస్‌పోర్ట్‌ ర్యాంక్.. ఫ్రాన్స్‌కు తిరుగులేదు

Passport Rankings: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కేటగిరీలో భారతదేశ స్థానం దిగజారింది. గతేడాది కన్నా ఈసారి ఒక్క మెట్టు దిగజారగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా ఫ్రాన్స్‌ నిలిచింది. తాజాగా వెలువడిన ఓ నివేదికలో ఇది వెల్లడైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 19, 2024, 05:34 PM IST
Henley Passport Index: దిగజారిన భారతదేశ పాస్‌పోర్ట్‌ ర్యాంక్.. ఫ్రాన్స్‌కు తిరుగులేదు

Henley Passport Rankings-2024: ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ల నాణ్యత, భద్రతా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రతియేటా ఓ నివేదిక విడుదల చేస్తుంది. 2024 సంవత్సరానికి సంబంధించి పాస్‌పోర్ట్‌ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా ఫ్రాన్స్‌కు సంబంధించిన పాస్‌పోర్టు నిలిచింది. తొలిస్థానాన్ని ఫ్రాన్స్‌ పాస్‌పోర్టు దక్కించుకుంది. ఇక భారతదేశ పాస్‌పోర్టు 84వ స్థానం నుంచి 85కు దిగజారింది.

Also Read: Raja Shivaji: మరాఠా సామ్రాజ్యాధిపతి పాత్రలో జెనీలియా భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. దర్శకత్వం కూడా

భారతదేశ ర్యాంకింగ్‌ దిగజారడం ఆశ్చర్యపరచగా.. వీసా లేకుండా భారతదేశ పాస్‌పోర్టుతో వెళ్లే దేశాల సంఖ్య మాత్రం పెరిగిపోయింది. గతేడాది 60 దేశాలకు ఉండగా ఈ ఏడాది 62కు పెరగడం గమనార్హం. థాయిలాండ్‌, మలేషియా, ఇరాన్‌ దేశాలు ఇటీవల వీసా లేకుండా భారతీయ పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని ప్రకటించాయి. అయినా కూడా ర్యాంక్‌ తగ్గడం విస్మయానికి గురి చేస్తోంది.  ఫ్రాన్స్‌ తొలిస్థానం దక్కించుకోవడం వెనుకాల ఓ కారణం ఉంది.

Also Read: BAPS Mandir: అబుదాబిలో తొలి మందిరం.. 'బాప్స్‌' అని ఎందుకు పిలుస్తారు? ఆలయ విశేషాలేమిటి?

194 దేశాలకు వీసా రహితంగా ఫ్రాన్స్‌ పాస్‌పోర్టుతో వెళ్లవచ్చు. ఈ కారణంగా ఫ్రాన్స్‌ అగ్రభాగాన్ని సొంతం చేసుకుంది. ఫ్రాన్స్‌తోపాటు తొలిస్థానంలో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ లు కూడా దక్కించుకున్నాయి. భారత్‌తో విబేధాలు కొనసాగిస్తున్న మాల్దీవులు 58వ స్థానంలో ఉంది. 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం మాల్దీవులు అందిస్తోంది. పొరుగు దేశాలు పాకిస్థాన్‌ 106వ స్థానంలో స్థిరంగా కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ 101 నుంచి 102వ స్థానానికి దిగజారింది. 

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల పాస్‌పోర్టులు, 277 ప్రయాణ గమ్యస్థానాలను కవర్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ ప్రత్యేక డేటా ఆధారంగా 19 ఏళ్ల నుంచి ర్యాంకింగ్‌లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రకటించే ర్యాంకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News