'పాకిస్థాన్‌లో కంటే భారత్‌లో మహిళలకు రక్షణ లేదు': లండన్ సర్వే

ప్రపంచంలో భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశమని లండన్‌కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడైంది.

Last Updated : Jun 26, 2018, 04:13 PM IST
'పాకిస్థాన్‌లో కంటే భారత్‌లో మహిళలకు రక్షణ లేదు': లండన్ సర్వే

ప్రపంచంలో భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశమని లండన్‌కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడైంది. భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు, సామాజిక వివక్ష, శ్రమ దోపిడీ సహా ఇతర అంశాలు.. అత్యధికంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. సోమాలియా దేశంలో కంటే భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సర్వే తేల్చిచెప్పింది.

ఈ సర్వే ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. తొలి 10 స్థానాల్లో నిలిచిన పాశ్చాత్య దేశాల్లో అమెరికా కూడా మూడవ స్థానంలో చేరింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, ఆర్థిక వనరులు, వివక్షత, లైంగిక హింస, అమ్మాయిల అక్రమ రవాణ సమస్యలపై 550  మంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపారు. ఆఫ్ఘనిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్థాన్, భారతదేశం, సోమాలియా మహిళలకు అత్యంత ప్రమాదక దేశాలుగా సర్వేలో వెల్లడైంది.   

2011వ సంవత్సరం నాటి సర్వేలో పాకిస్థాన్‌లో మహిళల రక్షణ సరిగా లేదు. కానీ తాజా సర్వేలో పాకిస్థాన్ (ఆరవ స్థానం) కంటే భారత్ మహిళలకు ప్రమాదకర దేశమని తేలింది. నిర్భయ ఘటన తరువాత అనేక చట్టాలను తీసుకువచ్చినా లైంగిక దాడులు ఆగడం లేదని థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ తెలిపింది. మహిళలపై లైంగిక నేరాలు, గృహహింస, అత్యాచారాల కేసుల విషయంలోనూ సత్వర న్యాయం దొరకడం లేదని పేర్కొంది.

వివిధ అంశాల్లో భారత్ స్థానం

  • ఆరోగ్యం-4
  • వివక్ష-3
  • సంస్కృతి&మతం-1
  • లైంగిక హింస- 1
  • గృహహింస-3
  • అక్రమ రవాణ-1

 

Trending News