న్యూ యార్క్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 20మంది మృతి

Updated: Oct 8, 2018, 09:32 AM IST
న్యూ యార్క్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20మంది మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళుతున్న కారు మరో కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. న్యూ యార్క్‌లోని అల్బానీ సమీపంలోని షోహారీ కౌంటీలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

అయితే అందులో ఒక కారు ఢీకొన్న తరువాత పక్కనున్న పాదచారులపైకి దూసుకెళ్లిందని.. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా తన కథనంలో పేర్కొంది. ప్రమాదానికి గురైన కారు సమీపంలోని ఓ కేఫ్‌లోకి చొచ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.