మలాలా కన్నీళ్ళ వెనుక ఉన్న కథ ఇదే..!

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Last Updated : Mar 31, 2018, 01:27 PM IST
మలాలా కన్నీళ్ళ వెనుక ఉన్న కథ ఇదే..!

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాకిస్తాన్‌కి పర్యటన నిమిత్తం వచ్చిన ఆమె స్వాట్ వ్యాలీ ప్రాంతానికి వెళ్లారు. చిత్రమేంటంటే.. 2012 సంవత్సరంలో అదే ప్రాంతంలో ఆమెను తాలిబన్లు షూట్ చేసి చంపడానికి ప్రయత్నించారు. స్వాట్ వ్యాలీ వెళ్లిన మలాలా తనను ఎక్కడైతే షూట్ చేయడానికి ప్రయత్నించారో.. ఆ స్పాట్‌ను కూడా సందర్శించారు.

అక్కడే ఆమె ఇల్లు కూడా ఉంది. ఆ పరిసరాలను చూసిన మలాలా ఉన్నట్టుండి ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లపర్యంతమయ్యారు. మలాలను ఆమె తండ్రి ఓదార్చారు. పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన మలాలా, ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసి హెలికాఫ్టర్‌లో ఇస్లామాబాద్ నుండి బయలుదేరారు. తన పర్యటనను ముగించుకొని మళ్లీ సోమవారం మలాలా బ్రిటన్ దేశానికి ప్రయాణమవ్వనున్నారు. 

చిత్రమేంటంటే.. తనపై తాలిబన్లు దాడి చేశాక.. మళ్లీ అదే ప్రాంతానికి మలాలా వచ్చి అయిదు సంవత్సరాలు కావస్తోంది. ఒక చిన్న సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు. బాలికల హక్కుల కోసం పోరాటం చేసిన మలాలా.. 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీలో చదువుతున్నారు. 

Trending News