అంత్యక్రియలకు అంతా సిద్ధమైన వేళ.. చిన్నారి మృతదేహంలో కదలిక.. చివరికి విషాదమే మిగిలింది..

Three Years Girl Dies Wakes UP in Funeral: తీవ్ర అస్వస్థతకు గురైన ఓ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ అంత్యక్రియల సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా కదలింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 26, 2022, 03:25 PM IST
  • అంత్యక్రియలకు అంతా సిద్ధమైన వేళ..
  • చిన్నారి మృతదేహంలో కదలిక..
  • చివరికి విషాదాంతం.. మెక్సికోలో ఘటన
అంత్యక్రియలకు అంతా సిద్ధమైన వేళ.. చిన్నారి మృతదేహంలో కదలిక.. చివరికి విషాదమే మిగిలింది..

Three Years Girl Dies Wakes up in Funeral: మెక్సికోలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన మూడేళ్ల చిన్నారిని ఆసుపత్రికి తరలించగా కాసేపటికే మృతి చెందింది. అయితే ఆ మరుసటి రోజు అంత్యక్రియల సందర్భంగా చిన్నారిలో ఆమె తల్లి, బంధువులు కదలికలు గుర్తించారు. వెంటనే శవపేటిక నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతకు ముందు రోజు తమ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పాప చనిపోకముందే చనిపోయినట్లు చెప్పారని ఆ చిన్నారి తల్లి క్యామిలా రొక్సానా మార్టినేజ్ ఆరోపించారు.

విల్లా డె రామోస్‌కి చెందిన క్యామిలా రొక్సానా మార్టినేజ్‌కి మూడేళ్ల పాప ఉంది. ఈ నెల 16న ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడింది. దీంతో వెంటనే క్యామిలా తన కూతురిని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యుడు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుడు చిన్నారిని పరీక్షించి కొన్ని మందులు రాశాడు. ఫ్రూట్స్, వాటర్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పాడు.

ఆసుపత్రిలో ఉన్నప్పుడే చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో చిన్నారిని ఎమర్జెన్సీ రూమ్‌‌కి తరలించారు. అక్కడ పాపకు ఆక్సిజన్ పెట్టి, సెలైన్లు ఎక్కించారు. కానీ కాసేపటికే చిన్నారి పల్స్ ఆగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఆ మరుసటిరోజు చిన్నారి అంత్యక్రియలకు అంతా సిద్ధమయ్యాక క్యామిలా తన బిడ్డ శరీరంలో కదలికలను గమనించింది. మొదట బంధువులు ఆమె మాటలను పట్టించుకోలేదు. బాధలో ఏదో మాట్లాడుతుందనుకున్నారు. కానీ కాసేపటికే క్యామిలా తల్లి కూడా చిన్నారి కళ్లు కదలడం గమనించింది. వెంటనే మళ్లీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముందు రోజు ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పాప చనిపోయిందని చెప్పారని... వైద్యుల నిర్లక్ష్యమే పాప చావుకు కారణమైందని క్యామిలా ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా చాలామందిని కలచివేసింది. 

Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

Also Read: NEET UG Result 2022 : నీట్ పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్ తేదీ ప్రకటించిన ఎన్‌టీఏ.. ఆన్సర్ కీ ఎప్పుడంటే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News