Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వణుకు..తాజాగా ఆయా దేశాల్లో కొత్త కేసులు..!

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ టెర్రర్ పుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన వైరస్..ఒక్కో దేశానికి పాకుంటూ వెళ్తోంది.

Written by - Alla Swamy | Last Updated : May 29, 2022, 05:07 PM IST
  • ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ విజృంభణ
  • రెట్టింపు అవుతున్న కేసులు
  • తాజాగా మరికొన్ని దేశాల్లోకి మంకీపాక్స్‌
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వణుకు..తాజాగా ఆయా దేశాల్లో కొత్త కేసులు..!

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ టెర్రర్ పుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన వైరస్..ఒక్కో దేశానికి పాకుంటూ వెళ్తోంది. మొన్నటివరకు కరోనాతో వణికిపోయిన దేశాలు..ఇప్పుడు మంకీపాక్స్‌కు కుదేలవుతున్నాయి. ఇప్పటికే 20కిపైగా దేశాల్లో కేసులు వెలుగు చూశాయి. రోజుకు ఒక్కో దేశంలో కేసులు రెట్టింపు అవుతున్నాయి.

తాజాగా మెక్సికో, ఐర్లాండ్ దేశాల్లో కేసులు బయటపడ్డాయి. అమెరికా నుంచి మెక్సికోకు వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ ఉన్నట్లు గుర్తించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఐనా చికిత్స అందిస్తున్నామన్నారు. బాధిత వ్యక్తి అమెరికా నుంచి నెదర్లాండ్ మీదుగా మెక్సికోకు వచ్చినట్లు తేల్చారు. ఐతే ఆ  వ్యక్తి ..వైరస్‌ ఎక్కడ సోకిందో తెలుసుకుంటామని వెల్లడించారు.

ఇటు ఐర్లాండ్‌లోనూ మంకీపాక్స్ తొలి కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. లక్షణాలున్న మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మంకీపాక్స్‌కు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ వైరస్‌కు వ్యాప్తి చెందే లక్షణం లేదని కొట్టిపారేస్తున్నారు. ఐనా అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

కొత్త వైరస్‌ కోరలు చాస్తుండటంతో పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. ఈక్రమంలో మనదేశంలో పరిశోధనలను మొదలు పెట్టారు. మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్..పరిశోధనలు చేసింది. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్ టైమ్ పీసీఆర్ కిట్‌ను తయారు చేసింది. ట్రివిట్రాన్‌ హెల్త్ కేర్‌కు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్‌గా ఉంటుందని బృందం సభ్యులు తెలిపారు.

ఈనేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న బాధితులను ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల మంకీపాక్స్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఒంటిపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఉన్న వారిని గుర్తించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఎవరైనా మంకీపాక్స్ అనుమానితులు ఉంటే వెంటనే జిల్లా వైద్యాధికారులను కలవాలని సూచించింది.

Also read: Indonesia boat accident: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 26 మంది గల్లంతు!

Also read: Obed McCoy: తల్లికి సీరియస్‌గా ఉన్నా..బరిలోకి దిగి ఔరా అనిపించిన మెక్కాయ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News