Monkeypox: పురుషులకు పురుషులకు మధ్య శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ..

WHO Alerts Countries on Monkeypox: మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ రూపంలో మరో పెను సవాల్ ఎదురవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 07:26 AM IST
  • ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్
  • రోజురోజుకు పెరుగుతున్న కేసులు
  • ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
Monkeypox: పురుషులకు పురుషులకు మధ్య శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ..

WHO Alerts Countries on Monkeypox: మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దశాబ్దాలుగా ఆఫ్రికాకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ఆఫ్రికా వెలుపల కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ ఆఫ్రికాలో 1400 మంకీపాక్స్ అనుమానిత కేసులు నమోదవగా.. ఈ వైరస్ కారణంగా 66 మంది మృతి చెందారు. ఆఫ్రికా వెలుపల గడిచిన నెల రోజుల్లో 29 దేశాల్లో 1 వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఈ వివరాలు వెల్లడించారు. 

'ఆఫ్రికాలో ఈ వైరస్ దశాబ్దాలుగా వ్యాప్తిలో ఉంది. మనుషుల ప్రాణాలను హరిస్తోంది. ఇప్పుడీ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటం దురదృష్టకరం. అభివృద్ది చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు బయటపడుతున్నాయి.కొన్ని దేశాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కూడా జరుగుతున్నట్లు ఇప్పుడిప్పుడే రిపోర్ట్స్ అందుతున్నాయి. గతంలో మంకీపాక్స్ వ్యాప్తిలో లేని దేశాల్లోనూ ఇప్పుడీ వ్యాధి ప్రబలుతుండటం నిజం. చిన్నారులు, గర్భిణి స్త్రీల్లో మంకీపాక్స్ రిస్క్‌పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది.' అని టెడ్రోస్ అధనోమ్ తెలిపారు.

పురుషులకు పురుషులకు మధ్య శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి :

ఆఫ్రికా వెలుపల మంకీపాక్స్ వ్యాప్తికి లైంగిక సంబంధాలతో సహా వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ వెల్లడించారు. యూరోప్, నార్త్ అమెరికాల్లో బయటపడిన మంకీపాక్స్ కేసుల్లో పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలు కలిగినవారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అయితే అన్ని కేసుల్లో అలా లేదన్నారు.

మంకీపాక్స్ కట్టడికి సర్వైలైన్స్, ట్రేసింగ్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సత్వరమే ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లయితే మంకీపాక్స్ లక్షణాలు బయటపడిన 4 రోజుల్లోపు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.రాబోయే కొద్దిరోజుల్లో మంకీపాక్స్‌ నుంచి కమ్యూనిటీ రక్షణకు డబ్ల్యూహెచ్ఓ కొత్త గైడ్‌ లైన్స్ విడుదల చేస్తుందన్నారు. 

యూకె, యూఎస్‌లలో పెరుగుతున్న కేసులు :

యూకె, యూఎస్‌లలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యూకెలో గురువారం (జూన్ 8) కొత్తగా 18 మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకూ యూకెలో నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య 321కి చేరింది. యూఎస్‌లోమరో 4 కొత్త కేసులు బయటపడగా ఇప్పటివరకూ మొత్తం 35 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు సీడీసీ ( Centers for Disease Control and Prevention) వెల్లడించింది.

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. జనసేనాని దారెటు?

Also Read: Horoscope Today June 9th : నేటి రాశి ఫలాలు... ఆ 2 రాశుల వారికి ప్రేమ బంధంలో అనుకోని ట్విస్టులు ఎదురవుతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News