PM MOdi: ఎర్రకోట నుంచి గర్జించిన మోదీ.. దెబ్బకు దిగోచ్చి నరేంద్రుడికి ఫోన్ కాల్ చేసిన యూనస్ మహమ్మద్..

bangladesh Muhammad yunus: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న అనేక ఘటనలు ప్రస్తుతం వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (ఆగస్టు 15) ఇండిపెండెన్స్ డే వేళ పీఎం  మోదీ హిందువుల వరుస దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 16, 2024, 07:16 PM IST
  • మోదీ దెబ్బకు దిగోచ్చిన బంగ్లాదేశ్..
  • దాడుల ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ..
PM MOdi: ఎర్రకోట నుంచి గర్జించిన మోదీ.. దెబ్బకు దిగోచ్చి నరేంద్రుడికి ఫోన్ కాల్ చేసిన యూనస్ మహమ్మద్..

Muhammad Yunus call PM Modi over Minorities in Bangladesh he assured him of Hindus safety: ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కల్లోలం ఇంకా కొనసాగుతుంది. గత కొన్నినెలలుగా రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపేసింది. ఏకంగా దేశ ప్రధాని షేక్ హసీనాను కట్టు బట్టలతో దేశం విడిచి వెళ్లిపోయేలా చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మిగత జడ్జీలు సైతం తమ పదవులను నుంచి తప్పుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో కొన్నిరోజులుగా అశాంతికర పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అక్కడ అల్లరి మూకలు మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేస్తున్న అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హిందు దేవాలయాలు, హిందువుల ఇళ్లలోనికి ప్రవేశించి, అమ్మాయిల్ని అత్యాచారాలు చేయడం, దోచుకోవడం వంటివి చేస్తున్నారు.

బలవంతంగా మతమార్పిడులకు కూడా పాల్పడుతున్నారని కూడా అనేకు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో... బంగ్లాదేశ్ లో ఏర్పడిన అనిశ్చితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు. అదే విధంగా దేశ ప్రధాని మోదీ ఇటీవల  ఎర్రకోట నుంచి కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అంశంపై స్పందించారు. ముఖ్యంగా హిందుదేవాలయాలు, హిందువులపైదాడులు ఘటన ఆందోళన కల్గిస్తుందని అన్నారు.దీనిపైన ఆ దేశంలో తొందరలోనే పరిస్థితులు సర్దుమణిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలన్నారు.

బంగ్లాలో ఉన్న హిందువుల గురించి.. 140 కోట్ల భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు.  ఈ నేపథ్యంలో బంగ్లాలో  ఏర్పాటు అయిన తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు స్వయంగా ఫోన్ చేసీ మరీ మాట్లాడారు.  బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులతోపాటు మైనారిటీల అందరి భద్రతను కాపాడతామని చెప్పారు. తమ ప్రభుత్వం హిందువుల్ని కాపాడటంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని కూడా బంగ్లా ప్రధాని హమీ ఇచ్చారు. 

ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.  తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్‌ మధ్య ఫోన్‌ సంభాషణ కొనసాగింది. మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన విషయాన్ని మోదీ.. ట్వీట్ చేశారు.

బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చాని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల శ్రేయస్సు, స్థిరమైన, శాంతియుత వాతావరణం ఏర్పడే దిశగా బంగ్లాకు భారత్ మద్దతుంటుందని మోదీ పేర్కొన్నారు.

Read more: PM Modi: దేశంలో మోదీ మేనియా.. తన రికార్డు తానే బద్దలు కొట్టిన నరేంద్రుడు.. అస్సలు ఊహించి ఉండరు..

అదే విధంగా.. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ, భద్రతకు మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. మరోవైపు.. మహమ్మద్ యూనస్.. ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడి వారు.. హిందువులపై దాడులు, ఆస్తులు విధ్వసంపై .. యూనస్ కు చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ సందర్బంగా.. బంగ్లాలో హింసాకాండకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని యూనస్  హమీ ఇచ్చినట్లు సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News