నిరవ్ మోదీకి మళ్లీ షాక్..

నిరవ్ మోదీకి మళ్లీ షాక్.. 

Updated: Apr 26, 2019, 04:00 PM IST
నిరవ్ మోదీకి మళ్లీ షాక్..
File pic

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా వున్న వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీకి లండన్ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ముచ్చటగా మూడోసారి నిరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టు.. ఈ కేసు విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. లండన్‌లో అరెస్ట్ అయినప్పటి నుంచి వాండ్స్‌వర్త్ జైలులో వుంటున్న నిరవ్ మోదీని జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుపర్చారు. 

గతంలో మార్చి 29న రెండోసారి నిరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సైతం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.