North Korea: పొరుగు దేశాల పట్లే కాకుండా దేశ ప్రజల పట్ల కూడా కర్కశత్వంగా వ్యవహరించే నియంతగా పేరుగాంచాడు. అతడే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. పేరు వింటే చాలు భయం పుట్టుకొచ్చే నిరంకుశ వైఖరి అతనిది. అలాంటి నియంత ఓ సమావేశంలో దేశం కోసం కంట నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఉత్తర కొరియాలో గత కొద్ది సంవత్సరాలుగా జననాలు రేటు పడిపోతోంది. 2022 నాటికి ఉత్తర కొరియాలో జననాల రేటు 1.79గా ఉంది. 2014లో ఇది 1.88గా ఉంది. ఉత్తర కొరియా ప్రత్యర్ధి దేశం దక్షిణ కొరియాతో పోలిస్తే ఇది తక్కువే. జనాభా 25.7 మిలియన్లు. హ్యుండయ్ రీసెర్చ్ సంస్థ ప్రకారం 2070 నాటికి ఉత్తర కొరియా జనాభా 23.7 మిలియన్లకు పడిపోనుంది. ఇదే ఇప్పుడు ఆ నియంత కన్నీటికి కారణమౌతోంది. దేశ జనాభాలో క్షీణత ఆందోళన కల్గిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ ఏంటనే ప్రశ్న తలెత్తింది. అందుకే దేశంలోని తల్లులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
దేశంలో మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. జననాల రేటు క్షీణించడాన్ని నియంత్రించాలని, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. అందుకే తమ ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని భావిస్తోందన్నారు. దేశంలో మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న కంట కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్కశత్వానికి మారుపేరుగా చెప్పుకునే నియంత కంట కన్నీరు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
NEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05J
— Collin Rugg (@CollinRugg) December 5, 2023
ఎంత నియంతైనా దేశం కోసం నిరంతరం ఆలోచిస్తాడని, అందుకే దేశంలో జననాల రేటు క్షీణించడంపై ఆందోళన చెందుతున్నాడని ఇదే నిజమైన దేశభక్తికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొన్నటి వరకూ కిమ్ జోంగ్ ఉన్లో ఓ నియంతను చూసిన ప్రపంచం ఇప్పుడు అతనిలో మరో కోణం చూసి ఆశ్చర్యపోతున్నారు.
Also read: H1B Visa: భారతీయులకు గుడ్‌న్యూస్, ఇకపై అక్కడే ఆ వీసాల రెన్యువల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook