అంకె చేసిన తప్పిదం: 15000 గుడ్లు తినగలరా..?

దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్  ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన నార్వే క్రీడాకారులకు ఓ వింత అనుభవం ఎదురైంది.

Updated: Feb 9, 2018, 06:06 PM IST
అంకె చేసిన తప్పిదం: 15000 గుడ్లు తినగలరా..?

దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్  ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన నార్వే క్రీడాకారులకు ఓ వింత అనుభవం ఎదురైంది. తమ ఆటగాళ్లు తినేందుకు 1,500 గుడ్లు కావాలని వారు నిర్వాహకులకి చెబితే.. ఆ మాటలను వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. 1,500 గుడ్లకు బదులు 15,000 గుడ్లు తీసుకొచ్చి ఆ క్రీడాకారుల మందుంచారు. అనుకోని ఆ ఘటనకు విస్తుపోయారు నార్వే ఆటగాళ్లు. ఇంతకీ తప్పు ఎక్కడ జరిగిందంటే.. దేశంకాని దేశంలో భాష అర్థం కాకపోవడం వల్ల నిర్వాహకులకు సమాచారాన్ని రాతపూర్వకంగా చెప్పడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయాన్ని తీసుకున్నారట నార్వే ఆటగాళ్లు. అ ట్రాన్స్‌లేషన్ అప్లికేషన్ కాస్త స్క్రీన్ పై అంకెను 1,500 కు బదులుగా 15,000గా చూపించడంతో అదే నిజమని నమ్మి.. అన్ని గుడ్లు ఆర్డర్ ఇచ్చారట. తర్వాత జరిగిన తప్పు తెలుసుకొని హాయిగా నవ్వుకున్నారు.