Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్థాన్... తాజాగా శ్రీలంక బాటలోనే పయనిస్తుంది. ప్రస్తుతం పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. పాక్ కరెన్సీ రోజురోజుకీ పతనమవుతుంది. దీంతో విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంది పొరుగుదేశం.
గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. తీసుకున్న రుణాలు చెల్లించలేక, కొత్త అప్పుల పుట్టక దాయాది దేశం దివాలా తీసే స్థితికి చేరుకుంది. దేశంలో ఆహార పదార్ధాలు ధరలు భగ్గుమంటున్నాయి. గత నెల 25 నుంచి ఇప్పటి వరకు పెట్రోల ధరలను 60 రూపాయల మేర పెంచింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం పాక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.209, డీజిల్ రేటు రూ.204 గా ఉంది.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది పాక్. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు తన మిత్ర దేశాల సహాయాన్ని కోరుతుంది. సౌదీ అరేబియా, యూఐఈల సహాయాన్ని ఆర్జిస్తోంది. అంతేకాకుండా ఐఎంఎఫ్ ప్యాకేజీ కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేదంటున్నారు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: Bangladesh Fire: కంటైనర్ డిపోలో మంటలు.. 35 మంది సజీవ దహనం.. 300 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook