పాకిస్తాన్ మాకు చేసిన మేలు ఏమిటి.. అందుకే ఆర్థిక సాయం బంద్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో తమ దేశానికి ఉండే సంబంధాల పటిష్టతను గురించి ఫాక్స్ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Last Updated : Nov 19, 2018, 01:47 PM IST
పాకిస్తాన్ మాకు చేసిన మేలు ఏమిటి.. అందుకే ఆర్థిక సాయం బంద్:  డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో తమ దేశానికి ఉండే సంబంధాల పటిష్టతను గురించి ఫాక్స్ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "పాకిస్తాన్ లాంటి దేశానికి అమెరికా ప్రతీ సంవత్సరం 1.3 బిలియన్ డాలర్లు సహాయం చేస్తోంది. అయినా మాకు వారి వల్ల ఒరిగేదేమీ ఉండడం లేదు. పైగా లాడెన్ లాంటి వ్యక్తికి తమ భూభూగంలో చోటు ఇచ్చి మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషయాలన్నీ పునరాలోచిస్తే.. మాకు పాకిస్తాన్‌కి సహాయం చేయడం సముచితం కాదనే అనిపిస్తోంది. అందుకే వారికి అందించే సాయాన్ని ఇక అమెరికా ఇవ్వకూడదని భావించింది" అని ట్రంప్ తెలిపారు.

గతంలో కూడా ట్రంప్ ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. అమెరికా పాకిస్తాన్ నుండి ఏమి  ఆశించి గత 15 సంవత్సరాలుగా ఆర్థిక సహాయం చేస్తుందో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు అమెరికా 33 బిలయన్ డాలర్లను పాకిస్తాన్‌కు సహాయంగా ఇచ్చిందని.. అయినా వారు అబద్ధాలకోరులుగా  వ్యవహరించారని, లాడెన్ జాడ తెలిసి కూడా చెప్పలేదని ట్రంప్ అన్నారు. 

"అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఏమనుకుంటోంది? అమెరికా నాయకులు చేతకాని వారనుకుంటుందా? మా సైనికులు ఉగ్రవాదుల వేట కోసం ఆఫ్ఘనిస్తాన్‌లో పడికాపులు పడుతుంటే.. లాడెన్ జాడ తెలిసి కూడా వారు చెప్పలేదు. ఇంత  నమ్మకద్రోహం చేసిన దేశానికి.. అమెరికా ఎందుకు సహాయం చేయాలి. అందుకే ఆ ప్రతిపాదనకు విముఖత చూపాను"" అని గతంలో ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ మధ్యకాలంలో అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య బంధాలు క్షీణిస్తున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవలే పాకిస్తాన్‌కు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యాక.. అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో పాకిస్తాన్ సందర్శనకు వెళ్లారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే ఇరు దేశాల ప్రధాన లక్ష్యం కావాలని ఆయన  కోరారు. 

Trending News