పాకిస్తాన్ కుయుక్తి..!!

'కరోనా వైరస్'.. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోంది. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్‌‌కు మాత్రం వరంలా మారింది.  కరోనా వైరస్ పేరుతో మరింత అరాచకానికి తెరతీసింది పాకిస్తాన్ ప్రభుత్వం. 

Last Updated : May 3, 2020, 03:56 PM IST
పాకిస్తాన్ కుయుక్తి..!!

'కరోనా వైరస్'.. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోంది. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్‌‌కు మాత్రం వరంలా మారింది.  కరోనా వైరస్ పేరుతో మరింత అరాచకానికి తెరతీసింది పాకిస్తాన్ ప్రభుత్వం. 

కరోనా వైరస్ పాకిస్తాన్ లోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. 440  మంది చనిపోయారు. అతి కొద్దికాలంలోనే పాకిస్తాన్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరించింది. లాహోర్ జైళ్లలో ఉన్న 50 మంది ఉగ్రవాదులకు కూడా కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ వ్యూహం సిద్ధం చేసింది. 

ఇందులో భాగంగా అతి భయంకరమైన ఉగ్రవాదులను కూడా విడుదల చేసేసింది ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వం. నిజానికి ఉగ్రవాదులందరినీ అరెస్టు చేయకపోతే పాకిస్తాన్  ను బ్లాక్ లిస్టులో పెడతామని ఫైనాన్సియల్  యాక్షన్ టాస్క్ ఫోర్స్ ..FATF హెచ్చరించింది. ఈ క్రమంలో ఇంతకు ముందే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ఉగ్రవాదులను అరెస్టు చేసి జైళ్లకు తరలించింది. ఐతే పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో చేర్చడంపై  వచ్చే నెల  FATF మరోసారి పరిశీలించనుంది. ఇంతలోనే పాకిస్తాన్ కరోనా వైరస్ ఉద్ధృతమవుతోందన్న నెపంతో ఉగ్రవాదులను విడుదల చేయడం కలకలం రేపుతోంది. 

ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తుంటే.. భారత సహా ఇతర దేశాలన్నీ కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం నిరంతరం భారత సరిహద్దుల్లో అలజడి రేపుతోంది. పదే  పదే  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ రోగులను భారత సరిహద్దు దాటించి .. ఇంకా అలజడి సృష్టించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతుంటే పాకిస్తాన్ నీచ బుద్ధిని చాటుకుంటోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News