Planet Parade: ఖగోళంలో 1000 ఏళ్ల తరువాత కన్పించనున్న అద్భుత దృశ్యం..మళ్లీ చూడలేరు!

Planet Parade: సౌర కుటుంబంలో చాలాసార్లు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అటువంటిదే మరో అద్భుతం త్వరలో చోటుచేసుకోబోతోంది. దాదాపు వేయి సంవత్సరాల తరువాత కన్పించనున్న ఆ అద్భుతం ఏంటో తెలుసా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2022, 03:16 PM IST
  • ఖగోళంలో రేపు అద్భుతం, వేయేళ్ల తరువాత తిరిగి ఆవిష్కృతం
  • వీనస్, మార్స్, జూపిటర్ , శాటర్న్ గ్రహాలు ఒకే వరుసలో..ప్లానెట్ పేరేడ్
  • గతంలో 947లో జరిగిందంటున్న శాస్త్రవేత్తలు, రేపు సూర్యోదయానికి ముందు జరగనున్న అద్భుతం
Planet Parade: ఖగోళంలో 1000 ఏళ్ల తరువాత కన్పించనున్న అద్భుత దృశ్యం..మళ్లీ చూడలేరు!

Planet Parade: సౌర కుటుంబంలో చాలాసార్లు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అటువంటిదే మరో అద్భుతం త్వరలో చోటుచేసుకోబోతోంది. దాదాపు వేయి సంవత్సరాల తరువాత కన్పించనున్న ఆ అద్భుతం ఏంటో తెలుసా..

2022 ఏప్రిల్ 30వ తేదీ. ఖగోళ శాస్త్రానికి సంబంధించి అమోఘమైంది. అద్బుతమైంది. ఆరోజు కేవలం సూర్య గ్రహణం ఒక్కటే కాదు..వరుసగా 4 గ్రహాలు ఒకే వరుసలో పేరేడ్ చేస్తున్నట్టుగా కన్పిస్తాయి. నాలుగు గ్రహాలు వరుసగా ఇలా రావడం దాదాపు వేయి ఏళ్ల తరువాత సంభవిస్తోంది. ఏప్రిల్ చివరి వారం నుంచే..శుక్ర, మంగళ, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో రావడం ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీ  సూర్యోదయానికి దాదాపు ఓ గంట ముందు తూర్పు దిశలో ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో కన్పిస్తాయి. గతంలో ఈ అద్భుతం 947లో జరిగింది.

ఒకే వరుసలో గ్రహాలు వచ్చినప్పుడు ప్లానేట్ పరేడ్ అని పిలుస్తారు. స్థూలంగా చెప్పాలంటే ఈ ప్లానెట్ పరేడ్‌లు మూడు రకాలు. సౌర కుటుంబంలోని 3 గ్రహాలు సూర్యునికి ఒకవైపు వచ్చినప్పుడు, రెండవది కొన్ని గ్రహాలు ఆకాశంలోని ఓ చిన్న భాగంలో ఒకే సమయంలో కన్పించినప్పుడు, మూడవది 4 గ్రహాలు ఒకే వరుసలో కన్పించినప్పుడు.  ప్రస్తుతం జరగబోయేది చాలా విభిన్నమైంది. ఈ మూడు రకాలవంటిది కాదు.

ఏప్రిల్ చివరి వారంలో 4 గ్రహాలు ఒకే వరుసలో రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా శుక్ర, మంగళ, బృహస్పతి, శని గ్రహాలు చంద్రుని తూర్పు రేఖాంశం నుంచి 30 డిగ్రీలపై కన్పిస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 30 న ఇది మరింత అద్భుతంగా కన్పించనుంది. సూర్యోదయానికి ఓ గంట ముందు అత్యంత ప్రకాశవంతమైన శుక్ర గ్రహం, బృహస్పతి ఒకేసారి అతి దగ్గరగా కన్పిస్తాయి. శుక్ర, బృహస్పతి గ్రహాలు 0.2 డిగ్రీల దక్షిణంలో ఉంటాయి. ఆకాశం నిర్మాలంగా  ఉండి..కాలుష్యం లేకపోతే టెలీస్కోప్ లేకుండానే ఈ అద్భుతం చూడవచ్చు.

Also read: Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్‌ తిన్న 151 మంది చిన్నారులకు అస్వస్థత..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News