Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్ పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే అది ఎంతో తియ్యగా చక్కని టెస్ట్‌తో ఉంటుంది. ముఖ్యంగా చిన్నారు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఈ కిండర్ జాయ్‌పై వస్తున్న వార్తలు చాక్లెట్ లవర్స్‌కు గుబులు పుట్టిస్తోంది. బెల్జియంలో ఈ కిండర్ జాయ్ చాక్లెట్‌ని తీని 151 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మరి కొందరు చిన్నారులు వాంతులు, అతిసారంతో బాధపడుతున్నారు. వీరిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు.
ఇక యూరప్‌లో కూడా ఇదే తరహాలో అస్వస్థతకు గురయ్యారని పలు వార్త సంస్థలు తెలిపాయి.ఈ చాక్లెట్‌లో 2021 డిసెంబర్‌లో సాల్మొనెల్లా టైఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియాను ఉన్నట్లు యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ కనుగొంది. ఈ బ్యాక్టీరియా అధికంగా ఉన్న పదార్థాలతో తయారైన కిండర్ తినడం వల్ల అస్వస్థత కలుగుతుందని పేర్నొన్నారు. ఆరు రకాల యాంటీబయాటిక్‌లకు నిరోధకతను కలిగి ఉన్న సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమని ఆహార భద్రతా సంస్థ తెలిపింది. ఈ కిండర్ జాయ్ తిన్న తర్వాత తొమ్మిది మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఎక్కువగా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌లతో అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించిన చిన్నారులు ఇప్పటికి వరకు ఎవరూ మృతి చెందలేదని యూరప్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బెల్జియమ్ లో ఉన్న కిండర్ జాయ్ తయారీ ఫ్యాక్టరీను సీజ్ చేశారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను పంపాలని ప్లాంట్ నిర్వహకులను అధికారులు ఆదేశించారు. ఇప్పటికి యూకేలో 65, ఫ్రాన్స్‌లో 25, బెల్జియంలో 26, అమెరికాలో 1, కేసులు వచ్చాయని వైద్యారోగ్య అధికారులు ప్రకటించారు.
Also Read: Viral Video: పుష్ప పాటకు విరాట్ డ్యాన్స్...నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో..!
Also Read: 10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.