కశ్మీర్‌పై నిర్ణయం భారత ప్రధాని మోదీకే వదిలేస్తున్నా : డొనాల్డ్ ట్రంప్

కశ్మీర్‌పై నిర్ణయం ప్రధాని మోదీకే వదిలేస్తున్నా : డొనాల్డ్ ట్రంప్

Last Updated : Aug 2, 2019, 02:35 PM IST
కశ్మీర్‌పై నిర్ణయం భారత ప్రధాని మోదీకే వదిలేస్తున్నా : డొనాల్డ్ ట్రంప్

కశ్మీర్ వివాదంలో భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా జోక్యం చేసుకునే విషయంలో నిర్ణయం ఏదైనా భారత ప్రధాని నరేంద్ర మోదీకే వదిలేస్తున్నా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లను కీర్తించిన ట్రంప్.. ఇద్దరూ గొప్పవారేనని అన్నారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా సిద్ధంగానే ఉన్నప్పటికీ.. అందుకు ఆమోదం చెబుతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది మాత్రం భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 

బ్యాంకాక్‌లో జరుగుతున్న తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సులో నేడు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా ప్రతినిథి మైక్ పొంపియో మధ్య భేటీ జరగడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Trending News