రామసేతు వివాదంపై మరో సంచలన ప్రకటన

రామసేతు మానవ నిర్మితమని ఓ ప్రముఖ అమెరికన్ టివి ఛానెల్ పేర్కొందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఛానల్ కార్యక్రమం పూర్తిగా చూసి అవగాహన పెంచుకోకుండానే కొందరు పుకార్లు వెదజల్లారని ఢిల్లీ సైన్స్ ఫోరం ఒక సంచలనాత్మక ప్రకటనను విడుదల చేసింది. 

Last Updated : Dec 17, 2017, 08:26 AM IST
రామసేతు వివాదంపై మరో సంచలన ప్రకటన

రామసేతు మానవ నిర్మితమని ఓ ప్రముఖ అమెరికన్ టివి ఛానల్ పేర్కొందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఛానల్ కార్యక్రమం పూర్తిగా చూసి అవగాహన పెంచుకోకుండానే కొందరు పుకార్లు వెదజల్లారని ఢిల్లీ సైన్స్ ఫోరం ఒక సంచలనాత్మక ప్రకటనను విడుదల చేసింది. రామసేతు 1.75 మిలియన్ల సంవత్సరాల క్రితం నిర్మించిన మానవ నిర్మాణమని గతంలో కూడా నాసా చెప్పినట్లు వార్తలు వచ్చాయని, అయితే తర్వాత నాసా అధికారులు తాము అటువంటి ప్రకటనలు ఎప్పుడూ చేయలేదని తెలిపారని.. కేవలం ఊహ చిత్రాలను మాత్రమే వారు బహిర్గతం చేశారని ఫోరం తెలియజేసింది. 

అలాగే ఢిల్లీ సైన్స్ ఫోరం రామసేతు నిర్మాణంపై వస్తున్న నిజనిజాలపై స్పందిస్తూ 'ఆ అమెరికన్ టివి ఛానల్ ప్రోమోలో రామసేతులో వాడిన రాళ్లు 7 వేల సంవత్సరాల క్రితం నాటివని.. ఇసుక 4 వేల సంవత్సరాల క్రితం నాటిదని పేర్కొన్నారు. అయితే పురాణాల ప్రకారం రాముడు పాలించిన యుగానికి, వారు చెబుతున్న కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ఛానల్ వారు ప్రోమోలో చెబుతున్న కాలానికి, మానవులు భూమిపై ఆవిర్భవించిన కాలమని ప్రముఖ శాస్త్రవేత్తలు చెబుతున్న కాలపు లెక్కలకూ పొంతన లేదు. 

అలాంటప్పుడు మానవుల ఆవిర్భావం జరగని కాలంలోనే మానవులు ఒక వంతెనను నిర్మించారన్న విషయంపై కూడా టీవీ ఛానల్ వారు వివరణ ఇవ్వాలి కదా.. ఆ వివరణను ఆ డాక్యుమెంటరీలో ఏ సందర్భంలో ఇచ్చారో.. అది చూస్తేగానీ తెలియదు. చూడకుండా మన ఊహాగానాలతో ఏవో కల్పించి చెప్పడం అనైతికం. భారతదేశంలోనే మేటి భూగోళ శాస్త్రవేత్త  ఎస్.రామానుజన్ చెప్పినదాని ప్రకారం రామసేతు ఒక సహజసిద్ధ నిర్మాణమే. మానవులు దానిని నిర్మించలేదు. ఆ అమెరికన్ ఛానెల్ మరి ఏ సందర్భంలో.. ఏ పరిశోధన చేసి.. ఎలా డాక్యుమెంటరీ తీసిందో మనం దానిని చూస్తేగానీ తెలియదు. అప్పటి వరకు రామసేతు నిర్మాణంపై అవాస్తవాలు ప్రచారం చేయకుండా ఉంటే మంచిది' అని ఢిల్లీ సైన్స్ ఫోరం తెలిపింది. 

Trending News