Sri Lanka Crisis: లంకకు భారత్ సాయం.. ఇంధనం, ఆహారధాన్యాలను పంపిన కేంద్ర సర్కార్

తినడానికి తిండిలేక.. రోగం వస్తే మందుల్లేక.. కాగితాలు లేక పరీక్షలు వాయిదా, డీజిల్‌ లేక బండ్లు నిలిచిపోయాయి.. నిరవధిక కరెంట్‌ కోతలు.. చాలా దయ నీయంగా మారింది లంకేయుల పరిస్థితి. అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకు భారత్ పంపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 09:52 AM IST
  • రోజు రోజుకు దిగజారుతున్న శ్రీలంక ఆర్థిక పరిస్థితి
  • ఆవేశంతో ప్రజలు రోడ్లు ఎక్కడంతో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.
  • శ్రీలంకకు ఇంధనం, ఆహారధాన్యాలు సాయం చేసిన భారత్
Sri Lanka Crisis: లంకకు భారత్ సాయం.. ఇంధనం, ఆహారధాన్యాలను పంపిన కేంద్ర సర్కార్

Sri Lanka Crisis: శ్రీలంక ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. తినడానికి తిండిలేదు.. రోగం వస్తే మందుల్లేవు.. కాగితాలు లేక పరీక్షలు వాయిదా, డీజిల్‌ లేక బండ్లు నిలిచిపోయాయి.. నిరవధిక కరెంట్‌ కోతలు.. ఇలా చాలా దయ నీయంగా మారింది లంకేయుల పరిస్థితి. దీంతో ఆవేశంతో ప్రజలు రోడ్లు ఎక్కడంతో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అంతర్యుయుద్ధం కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకు భారత్ పంపింది. 

శ్రీలంకను ఆహార సంక్షోభంతో పాటు ఇంధన సమస్య కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలు ఆరు వేల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు అందించాయి.  దేశ ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసింది. విదేశీ మారకద్రవ్యం జీరో అయ్యింది. విదేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకునే పరిస్థితిలో శ్రీలంక లేదు. ఈ సమయంలో భారత్‌ ఆదుకుంది. దాదాపు 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి అత్యంత ఘోరమైన తిరోగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అత్యవసరమైన వస్తువుల దిగుమతులకు సైతం విదేశీ కరెన్సీ కొరత ఉండటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి.

నిల్వలు అడుగంటి, ధరలు విపరీతంగా పెరిగిన శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ పంపింది భారత్. దీంతో పాటుగా ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన ఈ డీజిల్ ను శ్రీలంకకు అందించింది. మరోవైపు దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న వేళ దేశవ్యాప్తంగా శనివారం అత్యవసర పరిస్థితి విధిస్తూ గొటబాయ రాజపక్స గెజిట్‌ విడుదల చేశారు. భద్రతా దళాలకు విస్తృత అధికారులు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని భద్రతాబలగాలు ఆదేశించాయి.  రాజధాని కొలంబోతో సహా దేశమంతా సైన్యం పహారా కాస్తోంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. 

Also Read: Maxwell Join RCB: ఆర్సీబీ శిబిరంలో చేరిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!

Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News