ఆసియా క్రీడలు 2018: ఇండోనేషియాలో భారీ భూకంపం

ఆసియా క్రీడలు 2018 ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.

Last Updated : Aug 28, 2018, 10:47 PM IST
ఆసియా క్రీడలు 2018: ఇండోనేషియాలో భారీ భూకంపం

ఆసియా క్రీడలు 2018 ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూకంపం నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.

టీమర్‌ ద్వీపంలో కుపాంగ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశగా ఎనిమిది కిలోమీటర్ల లోతులో సముద్ర తీరంలో భూకంపం సంభవించిందని యూఎస్జీఎస్ సర్వే పేర్కొంది. ఈ భూకంప దాటికి ఆసియా క్రీడలు జరుగుతున్న జకార్తాతో పాటు సమీప ప్రాంతాల్లో భూమి కొంతమేర కంపించిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఈ ఏడాది ఇండోనేషియాలోని లంబోక్‌ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రతకు 80 మందికి పైగా మృతి చెందగా, వేలమంది పౌరులకు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఏడాదిలో సంభవించిన భూకంపాల ధాటికి ఇండోనేషియాలో సుమారు 555 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువ. ఈ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉంది. ఇక్కడ టెక్టానిక్ ఫకాలు పరస్పరం ఢీకొట్టుకుంటాయి. అగ్నిపర్వతాలు బద్దలై లావా పొంగిపొర్లుతుంది. 2004లో 9.3తీవ్రతలో ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో భూగర్భంలో సంభవించిన భూకంపం అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని సృష్టించింది. ఈ భూకంపానికి సునామి వచ్చి హిందూ మహా సముద్రం వ్యాపించి ఉన్న దేశాల్లో 2,20,000 మంది మరణించారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,68, 000 మంది చనిపోయారు.

Trending News